శని ఆదివారాలు సెలవులు ఉండే ఉద్యోగుల కోసం తెలంగాణ పర్యాటక శాఖ దేవాలయాల సందర్శర్ణానికి ప్రత్యేక ప్యాకేజి ,

సాఫ్ట్‌వేర్, ఇతర ఉద్యోగాల్లో ఉన్నవారికి వారాంతపు సెలవులుంటాయి. రెండురోజులు దేవాలయాలను పర్యటించాలనుకునేవారి కోసం రెండు రోజులపాటు టెంపుల్ టూర్ పేరుతో ప్యాకేజీని నిర్వహిస్తున్నది. ప్రతి శని, ఆదివారాలు రెండు రోజుల పాటు కవర్‌చేసే ఈ పర్యాటనలో యాదాద్రి, భద్రకాళి దేవాలయం, వెయ్యిస్తంబాల గుడి, లక్నవరం చెరువు, రామప్ప దేవాలయం, కాళేశ్వరం, కోటిలింగాల, ధర్మపురి, కొండగట్టు, వేములవాడ, విద్యాసరస్వతీ దేవి దేవాలయం వర్గల్ తదితర దేవాలయాలను సందర్శించవచ్చు.

సమయం: శనివారం ఉదయం 7.30లకు మొదలయ్యే ఈ టూర్ ఆదివారం రాత్రి గం॥ 10.30 నిమిషాలకు ముగుస్తుంది.