శబరిమల గొడవలో తెలుగు మహిళలు
శబరిమలై అయ్యప్ప ఆలయంలోకి మహిళలకు ప్రవేశంపై సుప్రీం కోర్టు అనుకూల తీర్పుతో తెలుగు రాష్ట్రానికి చెందిన ఇద్దరు మహిళలు మాధవి , రమాదేవి తమ కుటుంబాలతో శబరిమల యాత్రకు వచ్చారు. పంబా నదివద్ద ఆందోళనకారులు వారిని నిలిపివేసి వెనక్కిపంపించారు. పోలీసులు జోక్యంచేసుకున్నా వారిని పంపడం వారి వల్లకాలేదు. దీంతో కొండఎక్కకుండానే మాదవి బృందం వెనుతిరిగింది.