శిథిలావస్థలో ఉన్న పాఠశాలను ఆధునీకరించిన నర్సంపేట పోలీసులు.

ఖానాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చిలకమ్మ నగర్ గ్రామము లో శిథిలావస్థకు చేరుకున్న ప్రాథమిక పాఠశాలపై స్పందించిన నర్సంపేట ఏసీపీ సునీతా మోహన్ ఇన్స్పెక్టర్ బోనాల కిషన్ , నర్సంపేట రూరల్ ఇన్స్పెక్టర్ సతీష్ బాబు ఖానాపూర్ ఎస్సై అభినవ్ తమ వ్యక్తిగత శ్రద్ధతో శిథిలావస్థకు చేరుకున్న ప్రాథమిక పాఠశాలను ఆధునీకరించారు.
ఆధునీకరించబడిన చిలకమ్మ నగర్ ప్రాథమిక పాఠశాలను మంగళవారం వరంగల్ పోలీస్ కమిషనర్ డాక్టర్ వి. రవీందర్ , ఈస్ట్ జోన్ డిసిపి డాక్టర్ బి. అనురాధ సందర్శించారు .ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో సిపి గారి చేతుల మీదుగా పండ్ల మొక్కలు నాటడంతో పాటు నూతన తరగతి గదులను పోలీస్ కమిషనర్ పరిశీలించారు .

Advertisement

అనంతరం సిపి గారి చేతుల మీదుగా పాఠశాల విద్యార్థులకు నోట్ బుక్స్ అందజేశారు.