{"effects_tried":0,"photos_added":0,"origin":"unknown","total_effects_actions":0,"remix_data":[],"tools_used":{"tilt_shift":0,"resize":0,"adjust":0,"curves":0,"motion":0,"perspective":0,"clone":0,"crop":0,"enhance":0,"selection":0,"free_crop":0,"flip_rotate":0,"shape_crop":0,"stretch":0},"total_draw_actions":0,"total_editor_actions":{"border":0,"frame":0,"mask":0,"lensflare":0,"clipart":0,"text":0,"square_fit":0,"shape_mask":0,"callout":0},"source_sid":"36BBB364-3955-48CA-A04C-F2159106D598_1582187236224","total_editor_time":5,"total_draw_time":0,"effects_applied":0,"uid":"36BBB364-3955-48CA-A04C-F2159106D598_1582187210774","total_effects_time":0,"brushes_used":0,"height":2048,"layers_used":0,"width":4096,"subsource":"done_button"}

కాకతీయుల కళా క్షేత్రం శిల్పకళకు నిలయం అయిన ములుగు జిల్లాలోని పాలంపేటలో గల రామప్ప దేవాలయం మహాశివరాత్రి ఉత్సవాలకు ముస్తాబయింది. ఈ సారి రామప్ప కొత్తదనాన్ని సంతరించుకుంది. యునెస్కో గుర్తింపు నేపథ్యం పుణ్యమాని గత కలెక్టర్ నారాయణరెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గార్లతో అభివృద్ధికి నాంది పడింది..

తూర్పు ముఖద్వారం నుండి డబుల్ రోడ్డు, గార్డెన్లోని అంతర్గత రోడ్డు, తూర్పు ముఖద్వారం నుండి రామప్ప చెరువుకు లింకు రోడ్డు, సెంట్రల్ లైటింగ్ తదితర అభివృద్ధి పనులతో రామప్ప ముస్తాబయ్యింది. 21నుంచి 23 వరకు జరిగే ఈ జాతరలో ఉదయం సుప్రభాతం నుండి గణపతి పూజ, అఖండ దీపారాధన, రుద్రాభిషేకములు రాత్రి పది గంటలకు స్వామివారి కల్యాణం మహోత్సవాలు, జాగరణ జరుగును. రెండవ రోజు గణపతి పూజతో మొదలై రాత్రి దీపోత్సవం తెల్లవారుజామున ఉదయం నాలుగు గంటలకు అగ్నిగుండంలో నడుచుట, మూడవ రోజు ఉదయం నుండి సాయంత్రం వరకు నాగబలి గెలుపు, ఆశీర్వచనము, నిత్యనిధి జాతర జరుగును.