మనోజ్‌పై అనుమానం

సంచలన నటి శ్రీరెడ్డి మరోసారి వార్తల్లోకి ఎక్కారు. స్థానిక కోయంబేడు పోలీస్‌స్టేషన్‌లో తన కారుని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారని ఫిర్యాదు చేశారు.తన ఇంటికి సమీపంలో షూటింగ్‌ చేస్తున్న చిత్ర కార్యనిర్వాహకుడు మనోజ్‌పై అనుమానం ఉందని పేర్కొన్నారు. సంఘటనపై విచారణ జరిపి సంబంధిత వ్యక్తులపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఆ ప్రాంతంలో నిఘా కెమెరాలను పరిశీలిస్తున్నారు.

టాలీవుడ్, కోలీవుడ్‌ ప్రముఖులపై మీటూ ఆరోపణలు చేసి కలకలం సృష్టించిన శ్రీరెడ్డి తెలుగులో అవకాశాలు లేకపోవడంతో చెన్నైకి మకాం మార్చారు. ప్రస్తుతం స్తానిక వలసరవాక్కం, అన్భునగర్‌లోని ఒక ప్లాట్‌లో నివసిస్తున్నారు.
అందులో తాను ఉంటున్న ఇంటి సమీపంలో విశ్రాంతి పోలీస్‌ అధికారి బంగ్లా ఉందని, అందులో గత కొన్ని రోజులుగా సినిమా షూటింగ్‌ జరుగుతోందని తెలిపారు. దీంతో ఆ ప్రాంతంలో పలు కార్లను నిలుపుతున్నారని చెప్పారు. తాను సోమవారం బయటకు వెళ్లి రాత్రి తిరిగి రాగా తన ఇంటి ముందు ఒక వాహనం నిలిపి ఉండటంతో దాన్ని బయట పెట్టానని పేర్కొన్నారు. తరువాత తనకారు ధ్వంసం అయిందని అన్నారు..