Advertisement

వార్తలు రాసిన వెబ్ సైట్లు, యూట్యూబ్ చానళ్లు చిక్కుల్లో పడ్డాయి. వాటి ప్రతినిధులను, యజమానులను హైదరాబాద్ సైబర్ పోలీసులు విచారణకు పిలుపించుకుని పలు ప్రశ్నలు సంధిస్తున్నారు. అయితే తమకేమీ తెలియదనిని, అక్కడా, ఇక్కడా వచ్చిన సమాచారం ఆధారంగా, నిర్ధారించుకోని వార్తలు రాశామని మీడియా సంస్థలు చెబుతున్నాయి. కేవలం వ్యూస్ కోసం, తద్వారా డబ్బులు సంపాదించాలనే ఆ వార్తలు, వీడియోలు రూపొందించామని వెబ్ సైట్ల, చానళ్ల ప్రతినిధులు విచారణలో చెప్పారు.

ప్రభాస్, షర్మిల విషయంలో తాము సొంతంగా సేకరించిన సమాచారం ఏదీ లేదని, అక్కడా, ఇక్కడా చదివిందీ, చూసిందే నిజమని భావించి తమ పాఠకులకు, వీక్షకులకు సమాచారం అదించామని వారు చెప్పారు. ప్రభాస్, షర్మిల మధ్య సంబంధాలున్నట్లు ప్రచారం చేస్తే తమ కంటెంట్‌కు వ్యూస్ పెరిగి,

డబ్బులు వస్తాయనే ఆ పనికి పాల్పడ్డామన్నారు. దీని కోసం తాము ఎవరి వద్దనుంచీ డబ్బులు తీసుకోలేదని స్పష్టం చేశారు. వారి వాదనలు విన్న సైబర్ పోలీసులు తదుపరి విచారణ కోసం మళ్లీ హాజారు కావాలన్న షరతుపై వదిలిపెట్టారు. ప్రభాస్‌తో తనకు అన్యాయంగా సంబంధాలు అంటగడుతూ బురదజల్లుతున్నారని షర్మిల గత వారం హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దీంతో పలు చానళ్లకు, వెబ్ సైట్లకు పోలీసులు నోటీసులు జారీ చేసి, విచారణ ప్రారంభించారు.