షాకింగ్ : పోలీస్ ఇన్‌స్పెక్టర్ కూతురుపై గ్యాంగ్ రేప్
పోలీసు ఇన్‌స్పెక్టర్ కూతురుకే రక్షణలేని పరిస్థితి. వివరాళ్లోకి వెళ్తే కాన్పూర్‌లోని బాబుపూర్వ పోలీస్ స్టేషన్ పరిధిలో 11వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థినిపై వేర్వేరు కాలేజీలు ఇంజినీరింగ్ చదువుతున్న నలుగురు విద్యార్థిలు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నలుగురు నిందితుల్లో ఓ యువకుడితో మైనర్ అయిన బాధితురాలికి పరిచయం ఉంది, రెండు రోజుల క్రితం ఆమెను మభ్యపెట్టి ఓ ఫ్లాటుకు తీసుకెళ్లాడు, అనంతరం తన స్నేహితులతో కలిసి బాలికపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టాడు. అనంతరం కారులో తీసుకెళ్లి బబుపురా పోలీస్ స్టేషన్ దగ్గర వదిలివెళ్లినట్టు వెల్లడించారు. ఈ ఘటనలో నలుగురిని అదుపులో తీసుకున్నారు పోలీసులు.