విహార యాత్ర ముగించుకుని ఇంటికి చేరుకున్న ఓ మహిళకు భయానక అనుభవం ఎదురైంది. ఆస్ట్రేలియా పర్యటన ముగించుకుని ఇంటికి చేరుకున్న మోయిరా బాక్సాల్‌ అనే మహిళ.. తన సూట్‌కేసులోనిఓ ‘షూ’ లో దాగినపామును చూసి షాక్‌కు గరయింది. స్నేక్స్‌ ఆన్‌ ప్లేన్‌ చిత్రంలో మాదిరి.. ఆ పాము విమానంలో దాదాపు 14వేల మైళ్లదూరం ప్రయాణించింది. మోయిరా, క్వీన్స్‌లాండ్‌ నుంచి గ్లాస్గో వరకు ప్రయాణించే అంతసేపుపాము షూలోనే నక్కి ఉండటంతో దాని చర్మపు పై పోర ఉడిపోయింది.

వెంటనే ఈ విషయాన్ని మోయిరా జంతు సంరక్షణ సంస్థకు తెలియపరిచింది. వెంటనే రంగంలోకి దిగిన వారు ఆ పామును షూ నుంచి జాగ్రత్తగా బయటకు తీశారు. అయితే పాము విషపూరితమైన కాదని వారు చెప్పారు. గతంలో కూడా పాములు విమానంలో నక్కి ప్రయాణించిన ఘటనలు చోటు-చేసుకున్న సంగతి తెలిసిందే…