బొగత జలపాతం వద్ద సండే సందడి ! ఎంజాయ్ చేసిన సందర్శకులు, పర్యాటకులతో కిక్కిరిసిన జలపాతం

బొగత జన సంద్రమైంది . కొండల్లోంచి జాలువారుతున్న జలం . . సప్తస్వరాలు పలికిస్తుంటే . . ప్రకృతి ప్రేమికులు పులకించిపోయారు . హొయలు పోతూ పరుగులు తీస్తుంటే సెల్ఫీలు దిగుతూ . . కేరింతలు కొడుతూ సండండి చేశారు ప్రకృతి రమణీయతను ఇమిడించుకొన్న , ఈ జలపాతం సందర్శకులను ఇట్టే కట్టిపడేస్తోంది . వాజేడు మండలంలోని చీకుపల్లి అటవీప్రాంతంలో ఉన్న సుందర మనోహర జలపాతంలో ఆదివారం జన హోరుతో కిటకిటలాడింది . హైదరాబాద్ , కరీంనగర్ ఖమ్మం నల్గొండ , ఆదిలాబాద్ , భద్రాచలం , చర్ల కొత్తగూడెం , వరంగల్ జయశంకర్ భూపాలపల్లి , ములుగు , ఏటూర్ నాగారం మణుగూర్ తదితర ప్రదేశాలనుంచే కాకుండా మహారాష్ట్ర , ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లోని పలు గ్రామాల నుంచి బొగతను చూసేందుకు తరలివచ్చారు ప్రైవేటు వాహనాలు , బస్సులు ద్వీచక్ర వాహనాలతో జలపాతం పరిసరాలు కిక్కిరిసిపోయాయి కురుస్తున్న వర్షాలకు జలపాతంలోకి పెద్ద ఎత్తున వరద నీరు వస్తుండడంతో కళక కలాడుతుంది హైదరాబాద్ నుంచి వరంగల్ మీదుగా 270కిలో మీటర్లు ప్రయాణం చేస్తే బొగతకు చేరుకోవచ్చు .

అలాగే ఖమ్మం నుంచి భద్రాచలం మీదుగా 280కిలో మీటర్లు , వరంగల్ నుంచి130 , భద్రాచలం నుంచి110 , భద్రాద్రి కొత్తగూడెం నుంచి 180 , భీంనగర్ నుంచి 250 కిలో మీటర్లు ప్రయాణం చేస్తే సుందర దృశ్యాలను తిలకించవచ్చు ..