సైబరాబాద్ పోలీస్ కమిషనర్ గా ఇప్పుడు సీనియర్ ఐపీఎస్ అధికారి సజ్జనార్ ఉన్నారు. ఈయన గతంలో వరంగల్ ఎస్పీగా పనిచేశారు. దాదాపు 10 ఏళ్ల కిందట అక్కడ ఓ విద్యార్థినిపై యాసిడ్ దాడి చేసి ఆమె మరణానికి కారణమైన యువకులను ఇదే సజ్జనార్ ఎస్పీ హోదాలో ఎన్ కౌంటర్ చేశాడు.

అప్పుడు ఆంధ్రప్రదేశ్ లోనే ఈ ఘటన సంచలన వార్త అయ్యింది. ఎన్ కౌంటర్ చేసిన సజ్జనార్ నాడు తెలుగు రాష్ట్రాల్లో మహిళల పాలిట హీరో అయిపోయాడు. కానీ ఏకపక్ష నిర్ణయం తీసుకున్నందుకు ఆయనను ప్రభుత్వం ఆ తర్వాత బదిలీ చేసింది. అయితే సజ్జనార్ చర్య మాత్రం యాసిడ్ పోసే వారికి హెచ్చరికలా పనిచేసి అలాంటి దాడులు ఆగిపోయాయి.

తాజాగా సైబరాబాద్ పరిధిలోని శంషాబాద్ లో ప్రియాంకరెడ్డిని అత్యాచారం చేసి అతి దారుణంగా నలుగురు యువకులు హత్య చేశారు. ఈ ఉదంతం కూడా దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది. నాడు యాసిడ్ పోసిన వారిని ఎన్ కౌంటర్ చేసినట్టే నేడు ఈ నలుగురిను చేయాలని తాజాగా ప్రియాంకరెడ్డి నివాసం ఉంటున్న అపార్ట్ మెంట్ వాసులు వచ్చి సీపీ సజ్జనార్ ను కలిసి డిమాండ్ చేశారు దానికి వారికి సర్ధిచెప్పిన సీపీ సజ్జనార్.. మహిళల భద్రత విషయంలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని.. మహిళలకు సమస్యలు తలెత్తకుండా చూసుకుంటామని హామీ ఇచ్చారు.