ప్రధాని నరేంద్ర మోదీ స్వచ్ఛ సేవకుల పాదాలను కడిగారు. గంగానది ప్రక్షాళనలో నిత్యం సేవలందించినందుకు గాను సఫాయి కార్మికుల పాదాలను కడిగి గౌరవించారు. వారితో కాసేపు ముచ్చటించారు. ప్రయాగ్ రాజ్ లో నిర్వహించిన స్వచ్ కుంభ్ – స్వచ్ ఆభార్ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వచ్ఛ భారత్ లో వారి సేవలను మరిచిపొలేనివని కొనియాడారు ప్రధాని మోదీ.

అనంతరం ప్రయాగ్ రాజ్ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నప్రధాని మోదీ…దేశం స్వచ్ఛత దిశగా అడుగులు వేస్తోందని అన్నారు. రాబోయే గాంధీ జయంతి నాటికి భారత్ ను బహిరంగ మల విసర్జన రహిత దేశంగా ప్రకటించే దిశగా వెళ్తున్నామని అన్నారు. ప్రయాగ్ రాజ్ స్వచ్ఛాగరి దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. అంతకముందు కుంభమేళాలో పవిత్ర స్నానం ఆచరించారు నరేంద్రమోదీ. గంగ, యమున, సరస్వతి సంగమం దగ్గర పూజలు నిర్వహించారు. గంగమ్మకు హరతి ఇచ్చారు.