మేడారం: ములుగు జిల్లా సమ్మక్క-సారలమ్మ వనదేవతలను దర్షించుకొని భక్తులు మొక్కులు సమర్పించుకున్నారు. మేడారం లోని వనదేవతలను దర్శించుకోవడానికి వరంగల్, హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్ ప్రాంతాలతో పాటు పొరుగు రాష్ట్రాలైన చత్తిఘడ్, మహారాష్ట్ర నుంచి భక్తులు తరలివచ్చారు. కుటుంబాలతో వాహనాల్లో తరలివచ్చిన భక్తులు జంపన్న వాగు వద్ద పుణ్యస్నానాలు చేసి వనదేవతలైన సమ్మక్క-సారలమ్మ, పగిడిద్ద రాజు, గోవిందరాజులను దర్షించుకొని నిలువెత్తు బంగారాన్ని సమర్పించుకొని భక్తులు వనదేవతలకు మొక్కులు అప్పగించుకున్నారు. వందలాది కిలోమీటర్ల దూరం ప్రయాణించి దర్శనం చేసుకొని జంతు బలి గావించారు. చెట్ల కింద విడిది ఏర్పాటు చేసుకుని భోజనాలు చేసి కొద్ది సేపు విశ్రమించి సాయంత్రం వేళలో ఇళ్లకు తిరుగు ముఖం పట్టారు.