ఇటీవల జరిగిన మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో KTదొడ్డి మండలంలోని గువ్వలదిన్నె గ్రామానికి చెందిన మహాదేవి అనే మహిళ గ్రామ సర్పంచ్‌గా ఘన విజయం సాధించింది. ఇదిలా ఉండగా ఆమె ఇవాళ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆమెకు ఇది వరకే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఎన్నికల సమయంలోనే కాన్పు జరుగుంటే ఆమెను పంచాయతీ ఎన్నికలలో పోటీ నుంచి అధికారులు తప్పించేవారు. పంచాయతీ ఎన్నికలలో పోటీ చేయాలంటే ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉండకూడదు. కాగా, ఎన్నికల తరువాత మూడో కాన్పు కావడంతో సర్పంచ్‌గా ఎన్నిక చెల్లుతుందని అధికారులు తెలిపారు. కాగా,

తనకు ప్రజా సేవ చేసే అదృష్టం ఉన్నందుకే ఎన్నికల తరువాత మూడో బిడ్డకు జన్మనిచ్చానని, సర్పంచ్‌గా ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి వారి సమస్యలను పరిష్కరిస్తానని మహాదేవి తెలిపారు.