ఇప్పుడు రీల్ హీరోల కన్నా రియల్ హీరోలకే ఫ్యాన్స్ ఎక్కువ అని నిరూపిస్తోంది వింగ్ కమాండర్ అభినందన్ విషయంలో . శుక్రవారం రాత్రి పాక్ అభినందన్‌ను భారత్‌కు అప్పజెప్పిన విషయం తెలిసిందే. ఇలా రెండు రోజుల వ్యవధిలోనే అభినందన్‌కు దేశ వ్యాప్తంగా అభిమానులు ఏర్పడ్డారు. అయితే ఇప్పుడు ఆయన అభిమానులందరూ మెలేసిన మీసాన్ని పెంచుతున్నారు.
తాజాగా బెంగళూరుకు చెందిన మహమ్మద్ చాంద్ అనే వ్యక్తి అభినందన్ మీసం కట్టు మాదిరి, తను కూడా మీసాలు కట్ చేయించుకున్నాడు. ఇప్పుడు అతని ఫోటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ‘abhinandan moustache style’ అనే హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. దీని గురించి మహమ్మద్ మాట్లాడుతూ, ‘నేను అభినందన్ సర్‌కు వీరాభిమానిని. ఆయన మీసం స్టైల్ నాకు చాలా బాగా నచ్చింది. అందుకే ఇలా నేనుకూడా ఆ మీసం స్టైల్‌ను అనుసరిస్తున్నాను. అభినందన్ సర్ రియల్ హీరో. ఆయనలాగే మీసకట్టు చేయించుకొన్నందుకు నాకు చాలా సంతోషంగా, గర్వంగా కూడా ఉంది. ఒకప్పుడు నేను సల్మాన్ ఖాన్ ఫ్యాన్‌ని. కానీ ఇప్పుడు నా ఫేవరెట్ హీరో అభినందనే’ అని పేర్కొన్నాడు మహమ్మద్ చాంద్.