మధ్యతరగతి ప్రజలకు మరో షాక్ తగిలింది. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరల పెంపుతో అల్లాడుతున్న వారిపై గ్యాస్ సిలిండర్ ధరలు అధిక భారాన్ని మోపనున్నాయి. తాజాగా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు గ్యాస్ సిలిండర్ రేట్లను పెంచేశాయి. నాన్ సబ్సిడీ ఎల్‌పీజీ సిలిండర్ ధర సుమారు రూ.149 పెరగగా రేట్లు ఇవాళ్టి నుంచి అమలు కానున్నాయి. ఢిల్లీ ఎన్నికల తర్వాత ఒక్కసారిగా మెట్రో నగరాల్లో గ్యాస్ సిలిండర్ ధరలు ఒక్కసారిగా పెరిగాయి.

Advertisement

ఢిల్లీలో రూ.144 మేర గ్యాస్ సిలిండర్ ధర పెరిగి ఇప్పుడు అది కాస్తా రూ.858కు చేరుకుంది. ఇక కోల్‌కతాలో సిలిండర్ ధర రూ. 896కు చేరుకొని సుమారు రూ.149 పెరిగింది. ముంబైలో అయితే 14.2 కేజీల నాన్ సబ్సిడీ ఎల్‌పీజీ సిలిండర్ ధర ఇప్పుడు రూ.829 కాగా, రూ.145 మేర ధర పెరిగింది. అలాగే చెన్నైలో కొత్త ధర రూ.881కు చేరుకుంది. 2020, జనవరి 1 తర్వాత గ్యాస్ సిలిండర్ ధరలు పెరగడం ఇదే మొదటిసారి కావడం విశేషం. కాగా, గవర్నమెంట్ సబ్సిడీ సిలిండర్లు ఏడాదికి 12 ఇస్తున్న సంగతి తెలిసిందే.