సార్వత్రిక ఎన్నికల నగారా మోగింది. లోక్‌సభతో పాటు త్వరలోనే పదవీ కాలం ముగుస్తున్న ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలను నిర్వహించనుంది కేంద్ర ఎన్నికల సంఘం. దీనికి సంబంధించి ఆదివారం షెడ్యూలును విడుదల చేసింది. గత ఎన్నికల తరహాలోనే ఈసారి కూడా దేశవ్యాప్తంగా తొమ్మిది విడతల్లో ఎన్నికల ప్రక్రియ జరగనుంది. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటిస్తున్నారు సునీల్ అరోరా. షెడ్యూలు ప్రకటించిన మరుక్షణం నుంచి దేశవాప్తంగా ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది.
దేశవ్యాప్తంగా ఎన్ని దశల్లో పోలింగ్ ఉంటుంది? ఎన్నికల తేదీలు? తదితర వివరాలను సీఈసీ సునీల్ అరోరా ప్రకటించారు.
*ఏప్రిల్ లో తొలి విడత పోలింగ్
*మొత్తంగా 7 విడతల్లో పోలింగ్..
మార్చి 18 న మొదటి విడత నోటిఫికేషన్
నామినేషన్ల చివరి తేదీ మార్చి 25
నామినేషన్ల పరిశీలన మార్చి 26
నామినేషన్ల ఉపసంహరణ మార్చి 28
పోలింగ్ 11 ఏప్రిల్
కౌంటింగ్ మే 23
91 స్థానాలు, 20 రాష్ట్రాలు
మనది తొలి విడత పోలింగ్ లొనే
ఏప్రిల్ 11న తొలి విడత పోలింగ్ జరగనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఫేజ్ 1లో మొత్తం 91 లోక్‌సభ స్థానాల్లో పోలింగ్ జరగనుంది. తొలి విడతలోనే తెలుగు రాష్ట్రాల్లో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్(25), అరుణాచల్(2), అసోం(5), బీహార్(4), చత్తీస్ గఢ్(1), జమ్ముకశ్మీర్(2), మహారాష్ట్ర(7), మణిపూర్(1), మేఘాలయ(2), మిజోరం(1), నాగాలాండ్(1), ఒడిషా(4), సిక్కిం(1), తెలంగాణ(17), త్రిపుర(1), యూపీ(8), ఉత్తరాఖండ్(5), వెస్ట్ బెంగాల్(2), అండమాన్(1), లక్షద్వీప్(1)లలో పోలింగ్ జరగనుంది. మే 23న ఫలితాలు వెల్లడికానున్నాయి.