తెలుగుతో పాటు ప‌లు ఇత‌ర భాష‌ల్లోనూ అనేక చిత్రాల్లో పాట‌లు పాడిన సింగ‌ర్ సునీత గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈమె సింగ‌ర్ గానే కాక హీరోయిన్ల‌కు డబ్బింగ్ చెబుతూ కూడా త‌న గాత్ర మాధుర్యంతో ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తోంది. అయితే అంద‌రి జీవితాల్లోనూ ఎత్తు ప‌ల్లాలు ఉన్న‌ట్లుగానే ఈమె జీవితంలోనూ క‌ష్ట సుఖాలు ఉన్నాయి. ముఖ్యంగా మొద‌టి భ‌ర్త వ‌ల్ల ఈమె ఎన్నో ఇబ్బందులు ప‌డింది. అయితే సింగర్ సునీత రెండో పెళ్లి చేసుకున్నప్పటి నుండి సోషల్ మీడియాలో ఆమె గురించి ఏ వార్త వచ్చినా అది వైరల్ అవుతోంది. ఇక సునీత తన మనస్సుకు నచ్చిన రామ్ వీరపనేనితో ఏడడుగులు వేసింది. సునీత పెళ్ళికి చాలా మండి సెలబ్రేటీస్ హాజర‌య్యారు. ఈ పెళ్ళిలో సుమ తన స్నేహితురాలికి ఖరీదైన బహుమతి ఇచ్చింది. ఇక అసలు విషయంలోకి వస్తే, సునీత మొదటి భర్త గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. సునీత మొదటి పెళ్లి కూడా సినిమా స్టైల్ లోనే జరిగింది. అది కూడా కేవలం 19ఏళ్ళ వయసులోనే ప్రేమించి ఇంట్లో వారిని ఎదిరించి మరీ పెళ్లి చేసుకుంది.

ఆ తర్వాత పెద్దవారు ఒప్పుకొని ఆశీర్వదించారు. ఈమె మొదటి భర్త పేరు కిరణ్ ఆయన కూడా ఇండస్ట్రీలోనే ఉన్నాడు. సునీత గాయనిగా పరిచయం అయిన తర్వాత ఆమెకు ఇక్కడ కూడా చాలా మంది అభిమానులు వచ్చారు. ఇదిలా ఉండ‌గా ఈమెకు 17ఏళ్ళు ఉన్నపుడే కిరణ్ ఐ లవ్ యూ చెప్పాడు. అయితే వెంటనే ఆమె ఒప్పుకోలేదు దాదాపు ఏడాదిన్నర తిరిగిన తర్వాత ఓకే చెప్పింది. కానీ అప్పటికి కూడా ఆమె వయసు కేవలం 19ఏళ్ళు మాత్రమే. ఆ తర్వాత ఇద్దరు పిల్లలు పుట్టాక అనుకోని కొన్ని అభిప్రాయ బేధాల కారణంగా విడిపోయారు. అప్పటి నుంచి సునీత పిల్లలే లోకంగా జీవించారు. ఆ త‌రువాత మ‌ళ్లీ రెండో పెళ్లి చేసుకున్నారు. అయితే ఈమె భ‌ర్త‌ను కొంద‌రు అప్ప‌ట్లో హేళ‌న చేశారు. కానీ వారికి ఆమె గ‌ట్టిగా బ‌దులిచ్చింది. ఇక ఈమె గురించి ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో ఏ వార్త వ‌చ్చినా అది వైర‌ల్ అవుతోంది.