పుట్టిన రోజు వేడుకల్లో విషాద సంఘటన చోటుచేసుకుంది. కలుషిత కేక్‌ తిని తండ్రీకొడుకులు మృతి చెందిన ఘటన జిల్లాని కొమురవెల్లి మండలం ఐనపూర్‌లో కలకలం రేపింది. బుధవారం రాత్రి తండ్రి ఇస్తరిగల్లా రవి(39) అతని భార్య(35), కూతురు(12)లతో కలిసి కుమారుడి(9) పుట్టినరోజు వేడుక నిర్వహించాడు. అయితే, ఈ ఆనంద సమయంలో కేక్ తిన్న కుటుంబ సభ్యులు తీవ్ర అస్వస్థకు గురయ్యారు.

Advertisement

వెంటనే స్థానికులు చికిత్స నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో తండ్రి, కొడుకులు ఇద్దరూ చనిపోయారు. కూతురు పరిస్థితి విషమంగా ఉండడంతో ఐసియూలో ఉంచారు. తల్లి జనరల్ వార్డులో చికిత్స పొందుతున్నట్లు వైద్యులు తెలిపారు. కాగా, కేక్‌లో విషం కలిపినట్టు బాబాయ్‌ శ్రీనివాస్‌పై కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అన్నదమ్ముల మధ్య భూవివాదమే ఈ దారుణానికి కారణమని గ్రామస్థులు చెబుతున్నారు.