తెలంగాణ సీఎం కేసీఆర్ ఇంట విషాదం చోటు చేసుకుంది. ఆయన రెండవ సోదరి భర్త అనారోగ్యంతో ఇవాళ కన్నుమూశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా మర్రిమడ్ల వాస్తవ్యులు పర్వతనేని రాజేశ్వర్ రావు గారి వయసు 84 ఏళ్లు. అనారోగ్యంతో ఇవాళ ఉదయం ఆయన కన్నుమూశారు. దీంతో మంత్రులు కేటీఆర్ , హరిశరావు రాజేశ్వర్ రావు గారి పార్థీవదేహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. కేసీఆర్ తల్లిదండ్రుల స్వగ్రామం మెదక్ జిల్లాలోని చింతమడక గ్రామం. ఆయనకు ఇద్దరు సోదరీమణులు ఉన్నారు. వారి తల్లిదండ్రులు రాఘవరావు, వెంకటమ్మ. కేసీఆర్ కుటుంబం ఎగువ మానేరు డ్యాం నిర్మాణంలో భూమి కోల్పోయి చింతమడక గ్రామానికి వచ్చి స్థిరపడింది.