తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డిని ఐఏఎస్‌ ఆమ్రపాలి కలిశారు. ఇటీవల కేంద్ర సర్వీసులో ఆమ్రపాలి డిప్యుటేషన్ పూర్తి కావడంతో రాష్ట్ర సర్వీసులో చేరనున్నారు. ఈ క్రమంలో రేవంత్ రెడ్డిని కలిశారు. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఆమె రిపోర్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఆమ్రపాలి రాష్ట్ర విభజన తరువాత వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ గా పనిచేశారు.

తనపని తీరుతో డైనమిక్ ఆఫీసర్ గా పేరు తెచ్చుకున్నారు. 2020లో ఆమెకు ప్రధాని కార్యలయం నుంచి పిలుపు రావడంతో అక్కడ డిప్యూటి కార్యదర్శిగా పనిచేశారు. అక్కడ డిప్యుటేషన్ పూర్తి కావడంతో ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంలోకి వచ్చారు. ఆ మేరుకు ఇక్కడ రిపోర్ట్ చేసి సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు.