కెసిఅర్ ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల సందర్భంలో జరిగిన సభలల్లో సీతారాంనాయక్కే సీటు గ్యారంటీ అని చెప్పినప్పటికి తిరిగి అధినేత అవకాశం మాత్రం ఇవ్వలేదు . రెడ్యా కూతురు మాలోతు కవితను ప్రటించారు . దీంతో జిల్లా కేంద్రంతో తెరాస నేతలు కార్యకర్తలు మిఠాయి లుపంచుకొని సంబరాలు చేసుకున్నారు . ఇప్పటికే కాంగ్రెస్ నుండి కేంద్రమాజీ మంత్రి మమబూబాబాద్ మాజీ ఎంపీని ప్రకటించిన విషయం విదితమే . బిజెపి నుండి హుస్సేన్ నాయక్ ను ప్రకటించారు .

హుసేననాయక్ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మహబూబాబాద్ అసెంబ్లీకి పోటిచేశారు . తిరిగి హుస్సేన్ నాయకనే తమ అభ్యర్థిగా బిజెపి గురువారం విడుదల చేసిన జాభితాలో ప్రకటించింది . టిఆర్ఎస్ లో ఈ సీటుకు సంబందించి ఉత్కంటత నెలకొంది, సిట్టింగ్ ఎంపీ సీతారాంనాయక్ ఈ సీటుపై పూర్తి భరోసాతోనే ఉన్నాడు . అందుకు కారణం కెసిఅర్ మాట ఇస్తే తప్పుకోడనే నమ్మకంతోనే సీతారాం పూర్తి విశ్వాసంతోనే ఉండగా కెసిఅర్ సీతారాంకు పెద్ద షాక్ ఇచ్చాడు . మొత్తానికి ప్రధాన పార్టీలు టిఆర్ఎస్ కాంగ్రెస్ , బీజేపీలు తమ పార్టీ నుండి పోటీ చేసే అభ్యర్థులను ప్రటించారు . ఈ మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులు శుక్రవారం నేడు నామినేషన్లువయనున్నారు .

నాయక్ కుటుంబ సభ్యులను ఓదార్చిన ఎర్రబెల్లి

మాజీ ఎంపీ సీతారామ్ నాయక్ కుటుంబ సభ్యులను ఓదార్చిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు…సీతారాం గారికి రానున్న రోజుల్లో సముచిత స్థానాన్ని కట్టబెట్టే ఆలోచనలో కెసిఆర్ గారు ఉన్నారని,సరైన అవకాశం కల్పిస్తారని హామి..