ప్లాన్‌లో భాగంగా జ్యోతి తన స్నేహితురాలు సిమ్రాన్‌కు కూల్‌డ్రింక్ లో మత్తు మందు కలిపి తాగించారు. గాఢ నిద్రలోకి జారుకున్న తరువాత గొంతు కోసి హత్య చేశారు. అనంతరం సిమ్రాన్ దుస్తులు మారవడంతో పాటు గుర్తింపు కార్డులు మృతదేహం వద్ద పడేశారు. మృతదేహం వద్ద జ్యోతి గుర్తింపు కార్డులు ఉండడంతో పోలీసులు ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. కుటుంబ సభ్యులు తన కూతురు మృతదేహం అని చెప్పడంతో అంత్యక్రియలు జరిపించారు. సిమ్రాన్ కనిపించడంలేదని స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఆమె తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

యువతి హత్య సంబంధించిన ఫోటోలను సిమ్రాన్ తల్లిదండ్రులకు చూపించడంతో తన కూతరేనని గుర్తించారు. జ్యోతి ఎక్కడికి వెళ్లిందనే కోణంలో పోలీసులు దర్యాప్తు జరపడంతో సిమ్లాలో ఉన్నట్టు 2020లో గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. కృష్ణ జైలులో క్షయ వ్యాధితో మరణించాడు. మంగళవారం పానిపట్ కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం జ్యోతికి జీవిత ఖైదు పడింది.