‘ఇరుట్టు అరైయిల్‌ మురట్టు కుత్తు’ అనే తమిళ సినిమాలో చేసిన అసభ్య సన్నివేశాలు, బిగ్ బాస్ సీజన్ 2లో అభ్యంతరకరమైన దుస్తులతో పాప్యులారిటీని తెచ్చుకున్న హీరోయిన్ యషికా ఆనంద్, ఇప్పుడు మరోసారి విమర్శల పాలైంది.

గతంలో నటుడు మహత్‌ ను ప్రేమిస్తున్నానని చెప్పి, రచ్చ చేసిన ఆమె, కరెన్సీ నోటుపై ఆటోగ్రాఫ్ పెట్టి వివాదాలను కొనితెచ్చుకుంది. తాజాగా, ఫ్యాన్స్ తో ట్విట్టర్ ద్వారా మాట్లాడిన ఈ అమ్మడు, సూర్య ఫొటోను పోస్ట్‌ చేసి, ఆయన్ని పెళ్లాడాలని ఆశపడుతున్నట్లు చెప్పింది. దీంతో యాషికా వ్యాఖ్యలపై సూర్య అభిమానులు నిప్పులు చెరుగుతుండగా.

నటి జ్యోతిక ఫ్యాన్స్ ఆగ్రహంతో రగిలిపోతున్నారు. సూర్యకు పెళ్లి అయి, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారన్న విషయం తెలియదా? అని ప్రశ్నిస్తున్నారు. ఆమె సూర్యను పెళ్లాడాలని ఎలా అంటుందని ట్రోలింగ్ చేస్తున్నారు.