సినీ నటి రాధికా ఆప్టే ఏ పని చేసినా ఓ సెన్సేషన్. తాజాగా ఆమె ఓ బాలీవుడ్ సినిమాలో నటిస్తోంది. ఈ నేపథ్యంలో ఆమె నటించిన తొలి హాలీవుడ్‌ చిత్రం ‘ది వెడ్డింగ్‌ గెస్ట్‌’లోని సహనటుడితో కలిసి రొమాన్స్ చేస్తున్న సన్నివేశం బయటకు వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి లీకై సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది.దీనిపై రాధిక స్పందిస్తూ ‘ఇది కచ్చితంగా సైకోల పనే. వారే ఇలాంటి పనులు చేస్తుంటారు. అయినా లీకైన సన్నివేశంలో నాతో పాటు నటుడు దేవ్‌ పటేల్‌ కూడా ఉన్నారు. మరి అతని పేరుతో ఎందుకు వైరల్‌ అవడం లేదు? అందరూ ఎందుకు నా పేరును మాత్రమే వాడుకుని వైరల్‌ చేస్తున్నారు. ‘ది వెడ్డింగ్‌ గెస్ట్‌’ చిత్రంలో లీకైన ఈ సన్నివేశం మాత్రమే కాదు ఇంకా ఎన్నో అందమైన సన్నివేశాలు ఉన్నాయి. ఇలా సన్నివేశాలు లీక్‌ చేయడం వల్ల వారికి కలిగే ఆనందం ఏంటో నాకు అర్థం కాదు’ అంటూ మండిపడ్డారు రాధిక.