ఆ అమ్మాయి ప్రభాస్ ని చూసిన సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయ్యి గెంతులేస్తోంది. ఫోటో తీసుకున్నాక వెళుతూ వెళుతూ గబుక్కున ప్రభాస్ చెంపై నెమ్మదిగా గా కొట్టేసి వెళ్ళిపోయింది. ప్రభాస్ కూడా ఆమె చేష్టకు నవ్వేశాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రభాస్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ రేంజిలో ఉందో చెప్పడానికి ఈమెను ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇక సినిమాల పరంగా చూస్తే ప్రభాస్ నటించిన ‘సాహో’ చిత్రంతో ఆగస్ట్ 15 న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.