తెలంగాణ తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో విచిత్రం చోటుచేసుకుంది. చివరి నిమిషం వరకు ఎన్నికల ప్రచారంలో నిమగ్నమైన వ్యక్తి ఓటు వేసుకోవడం మరిచిపోవడమే అతడి పాలిట శాపమైంది. దీంతో ఒక్క ఓటు తేడాతో అతడు ఓటమి పాలయ్యాడు. యాదాద్రి జిల్లా బొమ్మలరామారం మండలం రంగాపురంలో ఈ విచిత్రం చోటుచేసుకుంది. సర్పంచి ఎన్నికల ప్రచారంలో నిమగ్నమైన ఆగంరెడ్డి దంపతులు సొంత ఓటు వేసుకోలేకపోయారు.

దీంతో ప్రత్యర్థి రామిడి ప్రభాకర్‌రెడ్డి ఒక్క ఓటుతో సర్పంచిగా గెలుపొందారు. అదే వారు ఓటు వేసి ఉంటే ఫలితం వీరికి అనుకూలంగా ఉండేది. ఎంత ప్రచారం చేసినా తీరా వాళ్లను వారే ఓడించుకున్నారు. ఎన్నికల్లో ప్రచారమే కాదు ! ఓట్లు వేయించడం ! తను కూడా ఓటు హక్కు వినియోగించుకోవడం ఎంతో ముఖ్యం మరి.