వరంగల్:

సొంత గూటికి కొండా దంపతులు…

పార్టీ మారే విషయంలో త్వరలోనే నిర్ణయం తీసుకుంటామంటూ అనుచరులతో చెప్పినట్లు సమాచారం.

ఈ నెల 9 లేక 12వ తేదీన కాంగ్రెస్ లో చేరే అవకాశం…
ఈరోజు హైదరాబాద్ లో కొండా సురేఖ మీడియా సమావేశం ఏర్పాటు చేసినట్టు సమాచారం , అదే రోజు తెలంగాణలో గులాం నబీ ఆజాద్ పర్యటన
రెండు టికెట్లకి ఓకే అన్న కాంగ్రెస్ అధిష్టానం, పరకాల నుండి సుస్మిత పటేల్ వరంగల్ తూర్పు నుండి కొండా సురేఖ పోటీచేసే అవకాశం…

కాగ, గురువారం ఉదయం కొండా సురేఖను అధిష్టానం టికెట్ విషయంలో అడిగినప్పుడు తనకు రెండు టికెట్లు అడిగినట్టు తెలిసింది. పరకాల, వరంగల్ తూర్పు అప్పగించాలంటూ కోరడంతో అధిష్టానం కొండాకు తూర్పు తప్ప వేరే ఆప్షన్ లేదని చెప్పినట్లు సమాచారం.

అయితే తూర్పులో తమ కూతురు సుస్మితాపటేల్‌ను ప్రకటించమని కొండా సురేఖ కోరితే, కొత్తగా వారసుల పేర్లను ఇప్పట్లో ప్రకటించేది లేదని, “తూర్పులో సురేఖ పేరు ప్రకటించాలా వద్దా” అని అడిగినప్పుడు తనకు వద్దంటూ చెప్పినట్లు సమాచారం…