మేడ్చల్ జిల్లా ఉప్పల్ రింగ్ రోడ్డు వద్ద సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లిటిల్ ఫ్లవర్ కాలేజీ వద్ద విద్యార్థులతో వెళ్తున్న ఆటోను లారీ ఢీకొట్టడంతో ఒక విద్యార్థి మృతి చెందాడు. 

ఉప్పల్ లో మంగళవారం ఉదయం భారీ ప్రమాదం చోటుచేసుకుంది . ఉప్పల్ లోని లిటిల్ ఫవర్ స్కూల్ వద్ద విద్యార్థులతో స్కూల్ కి వెళ్తున్న ఆటోను లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. కాగా క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి. చిన్నారులు స్కూల్ ముందే చనిపోవడం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది .

చిన్నారుల తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు . అత్యంత వేగంగా లారీ దూసుకురావడమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు . ఈ ఘటనలో మృతి చెందిన ఓ విద్యార్థిని మొయినుద్దీన్ గా గుర్తించారు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. అనంతరం విద్యార్థుల మృతదేహాన్ని గాందీ మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు, లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు . చిన్నారులు భాష్యం స్కూల్ కి చెందినవారుగా గుర్తించారు .