స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) తన వినియోగ దారులకు మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) తన వినియోగదారులకు మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది. వాహనదారులకు ఉచితంగా 5లీటర్ల పెట్రోల్ ఇవ్వనున్నట్లు గత నెలలో ప్రకటించింది. అయితే ఈ పథకం గడువు నవంబరు 23తోనే ముగిసింది. చాలా మందికి ఈ ఆఫర్ గురించి తెలియకపోవడంతో వినియోగించుకోలేకపోయారు. అలాంటి వారి కోసం ఈ ఆఫర్‌ను మరికొద్ది రోజులు పొడిగించింది. డిసెంబరు 15 వరకు పొడిగించినట్టు ఎస్‌బీఐ ట్విటర్‌లో ప్రకటించింది. ఇండియన్ ఆయిల్ ఔట్‌లెట్లలో ఎస్‌బీఐ కార్డు లేదా, భీమ్ ఎస్‌బీఐ పే ద్వారా 5 లీటర్ల వరకూ పెట్రోలు పూర్తిగా ఉచితంగా పొందవచ్చు.
ఆఫర్ పొందాలంటే
పెట్రోల్ కోనుగోలు చేసిన తర్వాత సంబంధిత కార్డు లేదా యాప్ ద్వారా చెల్లింపులు జరపాలి. ఆ తర్వాత వచ్చే రిఫరెన్స్ కోడ్‌లను 9222222084 కు SMS చేయాలి. భీమ్ యాప్ ద్వారా చెల్లిస్తే 12 అంకెల యూపీఐ రిఫరెన్స్ నంబర్ , SBI కార్డుల ద్వారా చెల్లిస్తే 6అంకెల కోడ్ వస్తుంది. దీన్ని నిర్దేశిత నంబరుకు ఎస్‌ఎంఎస్ చేయాలి. ఇలా కొనుగోలు చేసిన ఏడు రోజుల లోపు పంపించాల్సి ఉంటుంది. 2018 ఏప్రిల్ 1నాటికి 18 సంవత్సరాలు లేదా అంతకన్నా ఎక్కువ వయసున్న భారత పౌరులకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. ఒక కస్టమర్ రిపీట్ కొనుగోళ్లకు పలు ఎంట్రీలను నిర్దేశిత నంబరుకు పంపవచ్చు. అయితే ప‍్రతీ ఎస్‌ఎంఎస్‌కు డిఫరెంట్ కోడ్ ఉండాలి.
ఈ ఆఫర్ పొందాలంటే ఇండియన్ ఆయిల్‌కు చెందిన ఏ పెట్రోల్ బంకులోనైనా కనీసం 100 రూపాయల విలువైన పెట్రోలు కొనుగోలు చేయాలి