‌స‌్టేష‌న్ ఘ‌న్పూర్ లో మంత్రి కేటీఆర్ ప‌ర్య‌ట‌న

మంత్రి కేటీఆర్ మంగళవారం స్టేషన్ ఘన్‌పూర్‌ పర్యటనకు బయల్దేరి వెళ్లనున్నారు. స్థానిక విద్యాజ్యోతి డిగ్రీ కళాశాలలో మధ్యాహ్నం 3 గంటలకు ఏర్పాటు చేసిన విస్తృతస్థాయి సమావేశంలో ఆయన పా ల్గొంటారు. స్టేషన్‌ఘన్‌పూర్ అభ్యర్థి తాటికొండ రాజయ్య గెలుపు కోసం ప్రచారంలో అనుసరించాల్సిన వ్యూహాలపై ముఖ్యనాయకులు, కార్యకర్తలతో చర్చించి, దిశానిర్దేశం చేస్తారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, ఎంపీలు బండా ప్రకాశ్, పసునూరి దయాకర్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, గ్యాదరి బాలమల్లు తదితరులు పాల్గొంటారు.