ఈ సందర్భంగా SP. గారు మాట్లాడుతూ . ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, మరియు ఓటు వజ్రాయుధమని ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కు ద్వారా ప్రజా ప్రతినిధులను ఎన్నుకోవడంలో , ఓటు యొక్క ప్రాధాన్యత చాలా గొప్పదని మరియు ఓటు హక్కును ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా మీకు నచ్చిన వ్యక్తి కి ఓటు వేసే ప్రశాంతమైన వాతావరణం కల్పిస్తామని,

ఓటు విషయంలో ఎవరైనా బెదిరింపులకు పాలుపడితే వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇవ్వాలని, లేదా 100 కాల్ ఫోన్ చేసి తెలపాలని, మద్యానికి మరియు డబ్బులకు మరే ఇతర వస్తువులకు బానిసలు కావద్దని, మీకు నచ్చిన మెచ్చిన అభ్యర్థికి నిజాయితీగా, నిష్పక్షపాతంగా ,నిర్భయంగా ఓటు వేయాలన్నారు. ఎన్నికల సందర్భంగా మద్యం దుఖానాలు మూసివేయాలని, ఒకవేళ ఎవరైనా మద్యం అమ్మితే వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సిబ్బందికి తెలిపినారు. అదేవిదంగా ప్రజలు స్నేహపూరిత వాతావరణంలో పోటీ పడాలని, గొడవల వలన సాధారణ ప్రజల జీవితాలు చితికిపోతాయన్న విషయం అందరూ గుర్తించాలని జిల్లా ఎస్.పి. కుమారి చందన దీప్తి ఐ.పి.ఎస్ గారు అన్నారు. పల్లె వాతావరణం అత్యంత విశిష్టమైనదని, కాపాడుకొనవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉన్నదని అన్నారు.

ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఇప్పటికే పోలీసు బలగాలు గ్రామాలకు చేరుకున్నాయని, అధికారుల నేతృత్వంలో పకడ్బందీగా బందోబస్తు ఏర్పాట్లు ఉంటాయని తెలిపారు. అదేవిదంగా పోలింగ్ కేంద్రాల నిర్వహణ ప్రణాళిక ప్రకారం ముందుకెళ్తూ ఎన్నికలు సజావుగా సాగేలా చూడాలని సిబ్బందికి సూచించినారు. గత ఎన్నికలలో నమోదు అయిన కేసులు, ఎన్నికలలో గొడవలు అల్లర్లు సృష్టించిన వ్యక్తుల పట్ల నిఘా వేసి ఉంచాలన్నారు. ఓటర్లని ప్రలోభ పెట్టె అంశాలని నిరోధించాలిని అట్టి వ్యక్తులపైన కఠిన చర్యలు ఉంటాయని, ఎన్నికల్లో ఏమైనా సమస్యలు ఉంటే ముందుగానే గుర్తించి సంబంధిత పై అధికారుల దృష్టికి తీసుకరావాలన్నారు. ఎన్నికలను ప్రశాంత, స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రజలు అందరు తమ ఓటు హక్కును ఉపయోగించుకొనే విదంగా వారికి అవసరమైన చర్యలను తీసుకోవాలని సూచించారు. ఎలక్షన్ కు సంబంధించిన చిన్న సంఘటన జరిగినా లేక ఫిర్యాది వచ్చిన వీడియోగ్రాఫ్, సీసీ కెమెరా ఫుటేజ్ డాక్యుమెంటేషన్ తప్పనిసరిగా ఉండాలని అధికారులందరూ చాలా జాగ్రత్తతో అప్రమత్తతతో పనిచేయాలని సూచించారు.

అదేవిదంగా చట్టాన్ని అతిక్రమించేవారిపై కఠినంగా వ్యవహరిస్తామని, ముఖ్యంగా గొడవలు సృష్టించే వ్యక్తులపై తమ దృష్టి ఉన్నదని పేర్కొన్నారు. శాంతికాముకులైన జిల్లా ప్రజలు పోలీసు శాఖ పట్ల ఎంతో స్నేహంతో, నమ్మకంతో ఉంటారని, శాంతిభద్రతల సమస్య ఏర్పడకుండా చూడాలని సిబ్బందికి తెలిపినారు. ఈ ఎన్నికల సందర్భంగా పోలింగ్ కేంద్రాల వద్ద పూర్తిస్థాయి నిఘా ఉంటుందని, అతిగా ప్రవర్తించేవారిపై కేసులు నమోదు చేసి కోర్టులో నిలబెడతామని అన్నారు. శాంతియుత వాతావరణం కొరకై ప్రజలందరూ పోలీసుకు సహకరించాలని ఈ సందర్భంగా ఎస్.పి. గారు పిలుపునిచ్చారు.