తన స్నేహితుడు మోజు తీర్చనందుకు కట్టుకున్నభార్యకు విడాకులు ఇస్తానని బెదిరింపు, మీరట్ పట్టణంలో బాధిత మహిళకు వింత అనుభవం ఎదురైంది. భర్తతో కలిసి నివసిస్తూనే బాధిత మహిళ స్థానికంగా ఉన్న పరిశ్రమలో పనిచేస్తోంది. అయితే ఆమె భర్త కూడా అదే ప్రాంతంలో కూలీగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలోనే నిందితుడు పనిచేసే అడ్డాలో ఓ వ్యక్తి పరిచయం అయ్యాడు. ఇద్దరూ కలిసి మద్యం సేవించేవారు.

Advertisement

ఈ క్రమంలోనే ఆ వ్యక్తి దృష్టి బాధితురాలిపై పడింది. ఆమెను ఎలాగైన దక్కించుకోవాలనుకున్నాడు. అంతే బాధితురాలి భర్తకు డబ్బు సహాయం చేశాడు. అందుకు ప్రతిఫలంగా బాధితురాలిని కోరాడు. మద్యానికి బానిసైన నిందితుడు తన భార్యను పణంగా పెట్టాడు.
నిందితుడు వెంటనే ఇంటికి వెళ్లి తన స్నేహితుడి కోరిక తీర్చమని భార్యను ఆదేశించాడు. అందుకు ఆమె ససేమిరా అన్నది. దీంతో ఆగ్రహానికి గురైన నిందితుడు ఆమెను హింసించాడు.

భౌతికంగా దాడి చేశాడు. చివరకు ట్రిపుల్ తలాక్ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. బాధితురాలు చివరకు ఇంటినుంచి తప్పించుకొని పోలీస్ స్టేషన్ చేరింది. అక్కడే తన భర్తపై ట్రిపుల్ తలాక్ పేరిట ఫిర్యాదు నమోదు చేయగా, పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.