• 2 తులాల నెక్లెస్ , రూ . 13700 అపహరణ..

స్నేహమేరా జీవితం . . స్నేహమేరా శాశ్వతం . . అనే మాటలకు కలంకం తెచ్చే విధంగా ప్రవర్తించాడో యువకుడు . స్నేహితుడి ఇంట్లో కుక్కను చూడడానివచ్చి బంగారు నగలు , నగదును చోరీ చేశాడు . బాధితురాలు భాగ్యలక్ష్మీ తెలిపిన వివరాల ప్రకారం . .

జనగామ పట్టణంలో రేషన్ డీలర్ నడుపు కుంటున్న భాగ్యలక్ష్మీ కుమారుడు మంజునాథ్ స్నేహితుడు సాయికిరణ్ తమ ఇంట్లో ఉన్న పెంపుడు కుక్కను చూడడానికి వచ్చాడని తెలిపింది . అదే సమయంలో ఇంట్లో తాను ఒంటరిగా ఉండటాన్ని గుర్తించిన సాయికిరణ్ బీరువాలోని రెండు తులాల బంగారు నెక్లెస్ తో పాటు రూ . 13 , 700 నగదును దొంగిలించి పరారైనట్లు వివరించింది . ఈ విషయమై జనగామ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు .