స్టూడియో 11 స్పాలో జరుగుతున్న వ్యభిచార ముఠా గుట్టు రట్టయింది. ఇద్దరు యువతులను, మరో ఇద్దరు విటులను, స్పా నిర్వాహకుడైన ధనుంజయ రెడ్డిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు ఈ స్పాలపై దాడులు చేసిన సమయంలో ఎక్కడ చూసినా కండోమ్ లే కనిపించాయి. ఇటీవల పది రోజుల క్రిందట కూడా ఓ వ్యభిచార ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సిటిలు బాగా డెవెలప్ అయ్యింది, ఇప్పుడు ఏం కావాలన్నా ఇక్కడే దొరుకుతున్నాయి. మహా నగరాలకే పరిమితమైన వెరైటీ మసాజులు, క్రాస్ మసాజులు కూడా మన మాగుంట లే అవుట్ లోనే దొరుకుతున్నాయి ఖరీదైన సెటప్పులతో కస్టమర్లను రాబడుతూ మసాజ్ చేయడం ఆ పై వ్యభిచారం చేయించడం పరిపాటిగా మారింది…

వ్యభిచార నిర్వాహకులు పోలీసులకే సవాల్ విసురుతున్నారు. పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా కొత్త పుంతలు తొక్కుతూ తమ దందాను నిర్విరామంగా కొనసాగిస్తూనే ఉన్నారు. ఎన్నోచోట్ల ఫ్యామిలీ అపార్ట్‌మెంట్లలోనే గుట్టుగా వ్యభిచారం నిర్వహిస్తున్నారు. కొందరైతే మసాజ్, స్పా సెంటర్ల ముసుగులో యథేచ్ఛగా దందా కొనసాగిస్తూ లక్షల రూపాయలు వెనకేసుకుంటున్నారు. తాజాగా బయటపడిన సెక్స్ రాకెట్ పోలీసులకే సవాల్‌గా మారింది…