కూకట్‌పల్లి హౌసింగ్‌బోర్డు కాలనీలో స్పా, సెలూన్‌ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న సమాచారంతో కేపీహెచ్‌బీ పోలీసులు ఆకస్మికంగా దాడిచేసి పలువురిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 9 సెల్‌ఫోన్‌లు, లక్షకుపైగా నగదును స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం కేపీహెచ్‌బీ సీఐ లక్ష్మీనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. కేపీహెచ్‌బీకాలనీ 6వ ఫేజ్‌లో వెంపటి సతీష్‌ గ్లో వెల్‌ ఫ్యామిలీ స్పా అండ్‌ సెలూన్‌ను నిర్వహిస్తున్నాడు. ఇందులో ఓ మహిళా రిసెప్షనిస్ట్‌ను నియమించి స్పా ముసుగులో ఇతర ప్రాంతాలకు చెందిన మహిళలను రప్పించి వ్యభిచార కేంద్రాన్ని నడుపుతున్నాడు. విశ్వసనీయంగా అందిన సమాచారంతో కేపీహెచ్‌బీ పోలీసులు శనివారం రాత్రి స్పాపై ఆకస్మికంగా దాడి నిర్వహించి నిందితుడు వెంపటి వెంకటేశ్‌తో పాటు పలువురు విటులను, ముగ్గురు యువతులను అదుపులోకి తీసుకున్నారు.