ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికల ఓట్ల లెక్కింపు జరిగేలా చూడాలి: పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపు పరిశీలకులు గౌరవ శ్రీ. వినోద్ జుత్షి ఐ.ఏ.ఎస్
ఈ రోజు తేది 21-05-2019 చీఫ్ ఎలక్షన్ కార్యాలయం హైదరాబాద్ నుండి పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపు పరిశీలకులు గౌరవ శ్రీ. వినోద్ జుత్షి ఐ.ఏ.ఎస్ గారు, పోలీస్ ఉన్నతాదికారులతో నిర్వహించిన దృశ్య సమీక్ష సమావేశంలో మెదక్ జిల్లా ఎస్.పి కుమారి చందన దీప్తి ఐ.పి.ఎస్ గారు పాల్గొన్నారు. ఈ సమీక్షలో భాగంగా తేదీ 23- 05 – 2019 రోజునే ఉదయం 8 గంటల నుండి పార్లమెంటు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానున్న సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికల ఓట్ల లెక్కింపు నిర్వహించేందుకు తీసుకోవాల్సిన పటిష్టమైన చర్యలను వివరించారు. అలాగే ఎలాంటి సమస్యలు లేకుండా ముందస్తు ప్రణాళికలు తయారుచేసుకోవాలని ఓట్ల లెక్కింపు కేంద్రాలు వాటి స్థితిగతులు భౌగోళిక పరిస్థితుల గురించి మరియు పోలీసు భద్రత చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. పోలీసు అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండి సాంకేతికనైపుణ్యన్నీ ఉపయోగించుకొని పనిచెయ్యాలని, ఎన్నికల ఓట్ల లెక్కింపు పక్రియ ప్రశాంత, స్వేచ్ఛాయుత వాతావరణంలో జరిగే విదంగా అవసరమైన చర్యలను తీసుకోవాలని సూచించారు.

Advertisement

ఎలక్షన్ ఓట్ల లెక్కింపులో భాగంగా ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద చిన్న సంఘటన జరిగినా లేక ఫిర్యాది వచ్చిన వీడియోగ్రాఫ్, సీసీ కెమెరాలు సీసీ కెమెరా ఫుటేజ్ డాక్యుమెంటేషన్ తప్పనిసరిగా ఉండాలని అధికారులందరూ చాలా జాగ్రత్తతో అప్రమత్తతతో పనిచేయాలని సూచించారు. మరియు అధికారులు ఇన్ఫర్మేషన్ వ్యవస్థను రూపొందించుకోవాలని సూచించారు. శాంతి భద్రతలకు భంగం కలిగించేలా ప్రవర్తించే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని తెలిపారు. ఎన్నికలు ప్రశాంతంగా ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా నిర్వహించేందుకు, ప్రతి పోలీసు అధికారి పక్కా ప్రణాళికతో సిద్ధంగా వుండాలని అన్నారు. ఎన్నికల్ల ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద నేరాలకు పాల్పడిన నేరస్థుల సమాచారాన్ని సేకరించి వారి కదలికలపై నిరంతరం నిఘా ఉంచాలని, రౌడీ షీటర్ల జాబితా రూపోందించుకొని వారి కదలికలపై నిఘా పెట్టాలని, జిల్లాపాలన అధికారుల ఆద్వర్యంలో, డి.ఎస్.పి లు , సిఐ,లు ఎస్ఐ,లు రెవిన్యూ అదికారులు అందరు ఒక టీం గా కలిసి పనిచేస్తూ ఎప్పటికప్పుడు సమన్వయ పరుచుకుంటూ ఓట్ల లెక్కింపు ప్రశాంతమైన వాతావరణంలో జరగడానికి అన్ని ప్రభుత్వశాఖల సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

ఎన్నికలల్లో అధికారులు సమన్వయంతో పనిచేసి ఇన్సిడెంట్ ఫ్రీగా ఓట్ల ప్రక్రియ నిర్వహించాలని సూచించారు. ప్రజలతో సమన్వయం ఏర్పాటు చేసుకొని ప్రజల సహకారంతో పోలీసింగ్ తో ముందుకు వెళ్ళాలి అన్నారు. అదేవిదంగా ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా, పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలని, శాంతి భద్రతలకు భంగం వాటిల్లకుండా తగిన చర్యలు చేపట్టాలని, ఏ ఏ అంశాలను పొందుపరచాలో జిల్లా పోలీస్ ఉన్నత అధికారులకు మరియు సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో మెదక్ డి.ఎస్.పి. శ్రీ. కృష్ణమూర్తి గారు, మెదక్ ఎ.ఆర్. డి.ఎస్.పి. శ్రీ శ్రీనివాస్ గారు., డి.సి.ఆర్.బి. సి.ఐ. శ్రీ. చందర్ సింగ్ రాథోడ్ గారు, ఎస్.బి.ఎస్.ఐ. రాంబాబు గారు మరియు సి.సి. ప్రవీణ్ గారు పాల్గొన్నారు.