హంగ్‌ వస్తే హరీష్ రావు వె‌ సీఎం

టీఆర్‌ఎస్, ప్రజాకూటమి కి సమానంగా సీట్లు వచ్చి రాష్ట్రంలో హంగ్‌ ఏర్పడితే మంత్రి హరీశ్‌రావు పార్టీ నుంచి తన వర్గంతో బయటకు వచ్చి ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు రేవూరి ప్రకాశ్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌.

Advertisement

కూతురు, కుమారుడికి అధిక ప్రాధాన్యం ఇస్తూ తనను అవమానిస్తున్నారనే ఆవేదనతో హరీశ్‌రావు ఉన్నారని చెప్పారు. హన్మకొండలో సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ హరీశ్‌ రియల్, ప్రాక్టికల్‌ పొలిటీషియన్, హార్డ్‌ వర్కర్‌ కూడా, అసలు హరీశ్‌రావు లేని చంద్రశేఖర్‌రావును ఊహించలేం. రాజకీయ ఊహ తెలిసిన నాటి నుంచి కేసీఆర్‌ వెంటే ఉన్నారు అని పేర్కొన్నారు.