హద్దులు దాటినా ప్రేమ . sp కార్యాలయం ముందు యువతి

సూర్యాపేట మండల పరిధిలోని పిన్నాయిపాలెం గ్రామానికి చెందిన కక్కిరేణి ఉమారాణి హైద్రాబాద్‌లో డిగ్రీ విద్య పూర్తి చేసింది. కాగా నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం తాళ్లవీరప్పగూడెం గ్రామానికి చెందిన సిద్దబోయిన శ్రీకాంత్‌ మూడేళ్ల క్రితం పరిచమయ్యాడు. వారి పరిచయం ప్రేమగా మారి హద్దులు దాటింది.
ఈ లోపు శ్రీకాంత్‌కు ఓ నేషనల్‌ బ్యాంక్‌లో ఉద్యోగం లభించింది. ఇటీవల పెళ్లి చేసుకోవాలని శ్రీకాంత్‌ను కోరగా నిరాకరించాడు. వారి కుటుంబ సభ్యులకు విషయం తెలిపినప్పటికీ పెళ్లికి ఒప్పుకోలేదు. చేసేది లేక సుమారు 20 రోజుల క్రితం సూర్యాపేట రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో తనకు న్యాయం చేయాలని బాధితురాలు ఉమారాణి ఫిర్యాదు చేసింది. రోజులు గడుస్తున్నా పోలీసులు పట్టించుకోకపోవడంతో జిల్లా ఎస్పీని కలిసి తన గోడును విన్నవించుకునేందుకు జిల్లా పోలీస్‌ కార్యాలయానికి వెళ్లింది.
వెంట పురుగుల మందు డబ్బాను తీసుకుని వెళ్లింది.

ఆ సమయంలో జిల్లా ఎస్పీ ఉన్నతాధికారుల వీడియో కాన్పరెన్స్‌లో ఉండటంతో కాసేపు వేచి చూ సినప్పటికీ ఎస్పీని కలవటం కుదరలేదు. దీంతో చేసేదిలేక ఉమారాణి తన వెంట తెచ్చుకున్న పురుగుల మందును జిల్లా పోలీస్‌ కార్యాలయం ప్రహరీ వద్దకు వెళ్లి తాగింది. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే చికిత్స కోసం జిల్లా కేంద్రంలోని ఆసుపత్రికి తరలించారు.