హనుమకొండ బస్టాండ్ సమీపంలోని కళ్యాణ లక్ష్మి షాపింగ్ మాల్ నూతన బ్రాంచ్ ని నేడు రాష్ట్ర పంచాయతీరాజ్ & గ్రామీణ అభివృద్ధి శాఖ మరియు నీటిపారుదల శాఖ మంత్రి శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు గారు, రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రివర్యులు శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ నాణ్యమైన వస్త్రాలను అతి తక్కువ ధరకే వినియోగదారులకు అందించాలన్నారు.

షాపు యజమానులను వారు అభినందించి, బెస్ట్ ఆఫ్ లక్ చెప్పారు. షాపింగ్ మాల్ యజమానులు ఈ సందర్భంగా మంత్రులను శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌, వరంగల్ మేయ‌ర్ గుండు సుధారాణి తదితరులు పాల్గొన్నారు.