వరంగల్ టౌన్ : విద్యార్థులకు వండి పెట్టాల్సిన బియ్యాన్ని వార్డెన్ ప్రమేయంతో హాస్టల్లో పని చేసే వర్కర్లు బియ్యం బస్తాలను దొంగతనంగా ఆటోలో తరలించుకొని పోతున్నారు. ఇది చూసిన విద్యార్థులు ఆ ఆటోను అడ్డుకున్నారు. వరంగల్ అర్బన్ జిల్లా జూలైవాడ ఎస్టీ హాస్టల్లో అక్రమంగా బియ్యాన్ని ఉదయం 3 గంటలకు తరలిస్తుంటే అడ్డుకున్నామని, వార్డెన్ రాధిక, వర్కర్లను సస్పెండ్ చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. నాణ్యమైన భోజనం అందించాలని, హాస్టల్ నుండి విద్యార్థులు అర్బన్ జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి ఆందోళన చేశారు. ఈ ర్యాలీకి ఎబివిపి విద్యార్థులు మద్దతు తెలిపి, సంఘీభావం ప్రకటించారు.