వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండ టైలర్ స్ట్రీట్ లో వ్యభిచార గృహాలపై టాస్క్ ఫోర్స్ దాడులు

వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండ టైలర్ స్ట్రీట్‌లో వ్యభిచార గృహాలపై టాస్క్‌ఫోర్స్ సిబ్బంది దాడులు నిర్వహించారు. ముగ్గురు విటులను అరెస్టు చేసిన పోలీసులు, నలుగురు వ్యభిచార బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించారు. వ్యభిచారం నడిపిస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి రూ.15వేల990 నగదు, ఏడు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.