హన్మకొండ నయీంనగర్ సమీపంలోని లష్కర్‌సింగారానికి చెందిన మహిళ కంజర్ల ప్రశాంతికి పురిటి నొప్పులు రావడంతో ఆదివారం ఉదయం భర్త ప్రవీణ్ ఆసుపత్రికి తీసుకొచ్చారు. వైద్యులు పరీక్షించిన తర్వాత అడ్మిట్ చేసుకున్నారు. నాలుగు రోజులు పర్యవేక్షణలో ఉంచుకున్న వైద్యులు ఆపరేషన్ థియేటర్‌కు తీసుకెళ్లిన గంట తర్వాత తల్లికి బీపీ, షుగర్ ఉండడంతో శిశువు మృతి చెందిందని తెలిపారని బందువులు బోరున విలపించారు. నాలుగు రోజుల నుంచి పరీక్షించిన వైద్యులు అంతా బాగుందని చెప్పి ఆపరేషన్ తర్వాత పాప మృతి చెందడం పూర్తిగా వైద్యుల నిర్లక్ష్యమేనని ఆవేదన వ్యక్తం చేశారు తల్లిదండ్రులు, బంధువులు ఆసుపత్రి ఎదుట ఆందోళన చేశారు. వైద్యులు, సూపరింటెండెంట్, ఆర్‌ఎంవోకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.