హరీశ్‌ రావుకు 50 లక్షలు ఫైన్ ! ఎందుకంటే ?

రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌ రావు తనకు తాను రూ.50లక్షల జరిమానా వేసుకున్నారు. అదెలా అంటే.. శక్రవారం మధ్యాహ్నం 11:30 గంటలకు సిద్దిపేట జిల్లా దుబ్బాకలో మంత్రి హరీశ్‌ సభ ఖరారైంది. ఆ సభలో మహిళలకు మెప్మా రుణాలు, చెత్తబుట్టల పంపిణీ కార్యక్రమం ఉండగా హరీశ్‌, ఎంఎల్ఎ సోలిపేట రామలింగారెడ్డితో కలిసి సభకు మధ్యాహ్నం 3:30 వెళ్లారు.

అప్పటిదాకా ఓర్పుగా వేచి వున్న మహిళలకు మంత్రి హరీశ్‌ క్షమాపణలు చెప్పారు. అందుకు పరిహారంగా తనకు జరిమానా వేయాలని ఆయన వారిని కోరారు. దీంతో తమకు మహిళా భవనం కోసం నిధులను మంజూరు చేయాలని మంత్రిని కోరారు. దానికి మంత్రి కూడా అంగీకారం తెలిపారు. భవన నిర్మాణానికి రూ.50లక్షలను మంజూరు చేయిస్తానని వారికి హామీ ఇచ్చారు. వెంటనే అధికారులతో మాట్లాడిన హరీశ్ నిధులను మంజూరు చేయించాలని ఆదేశించారు…