హవాలా మార్గంలో 5కోట్ల 80 లక్షల రూపాయల డబ్బును తరలిస్తున్న మగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసిన జనగామ పోలీసులు

ఈ నెల 7వ తేదిన జరగనున్న శాసనసభ ఎన్నికలను సజావుగా నిర్వహించడంతో పాటు ఓటర్లను ప్రలోభ చేసేందుకు అక్రంగా తరలించే డబ్బు, మద్యం నియంత్రించేందుకు గాను వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వందకు పైగా చేక్ పోస్ట్ లను ఎర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఈ రో జు తెల్లవారుజామున జనగాం ఎస్ సై. శ్రీనివాస్ ఆధ్వర్యంలో పోలీసులు పెంబర్తి గ్రామమ చేక్ పోస్ట్ వద్ద విధులు నిర్వహిస్తుండగా హైదరాబాదు నుండి వస్తున్న ఎ.పి 36 సికె. 4985 మారుతీ డిజైర్ ను అనుమానంతొ అపి తనీఖీ చేయగా కారులో రహస్యం దాచివుంచిన 5కోట్ల80లక్షల65వేల రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకోవడం పాటు కారు డ్రెైవర్ తో మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేసి జనగామ పోలీస్ తరలించారు.

అనంతరం పోలీసులు చెపట్టిన విచారణలో హైదరాబాదు గోషామహల్ ప్రాంతానికి చెందిన కిర్తి కుమార్ జైన్ అనే వ్యక్తి హవాలా మార్గంలో ఖమ్మం జిల్లాలొ ఎన్నికల బరిలో వున్న నామా నాగేశ్వరరావు కు 2.5కోట్లు, వరంగల్ తూర్పు అభ్యర్థి వద్దిరాజు రవిచంద్ర కు 2కోట్లు మరియు కోండమురళికి 2.3 కోట్లను అందజేసేందుకు వస్తున్నట్లుగా నిందితులు పోలీసుల విచారణ లో తెలిపినట్లు గా వరంగల్ పోలీస్ కమిషనర్ డా. వి. రవీందర్ మీడియా సమావేశంలో తెలిపారు.