ప్రైవేట్‌ హాస్టల్‌లోని యువతులు స్నానాలు చేస్తుండగా వీడియోలు తీసిన బాలుడిని మానసిక వైద్యురాలు లావణ్య సమక్షంలో పోలీసులు బుధవారం విచారించారు.

బాలుడు ఎన్ని వీడియోలు తీశాడు..? ఎంత కాలం నుంచి తీస్తున్నాడు..? వాటిని ఎవరెవరికి పంపాడనే విషయమై అధికారులు ప్రశ్నించారు.  బాలుడు తన ట్యాబ్‌లో 7 వీడియోలు చిత్రీకరించినట్లు పోలీసుల ముందు అంగీకరించారు. ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ నుంచి అందిన వివరాల ప్రకారం, బాలుడు 7 వీడియోలు తీసినట్లు తేలింది. ఆ బాలుడి మానసిక స్థితిని పరిగణలోకి తీసుకున్న పోలీసులు. మానసిక వైద్యురాలు సమక్షంలో కౌన్సెలింగ్‌ నిర్వహిస్తూ వివరాలు రాబట్టినట్లు మాదాపూర్‌ ఇన్‌స్పెక్టర్‌ నాగేశ్వరరావు తెలిపారు. తాను తీసిన వీడియోలను అతని స్నేహితులకు ఎవరికైనా పంపాడా అనే విషయంపై ఆరా తీయగా ఎవరికీ షేర్‌ చేయలేదని పోలీసుల విచారణలో తేలినట్లు సమాచారం. అనంతరం బాలుడిని పోలీసులు సైదాబాద్‌లోని జువెనైల్‌ హోంకు తరలించినట్లు పేర్కొన్నారు.