హాస్టల్ సమస్యలు పరిష్కరించాలని ఆందోళన

హనుమకొండ హాస్టల్ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కాకతీయ యూనివర్సిటీ ఇంజనీరింగ్ విద్యార్థులు ఆందోళన నిర్వహించారు. హాస్టల్ భవనానికి సున్నం వేయించాలని, రోడ్డు సక్రమంగా లేదని, చిత్తడి అవుతుందని చెప్పారు. తక్షణమే పనులను చేయించాలన్నారు. విషయాన్నీ కళాశాల ప్రిన్సిపాల్ మల్లారెడ్డి రిజిస్టార్ పురుషోత్తం దృష్టికి తీసుకెళ్లగా ఆయన అక్కడికి చేరుకుని చేరుకున్నారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇవ్వడంతో విద్యార్థులు ఆందోళన విరమించారు.