ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం అస్వస్థతకు గురయ్యారు. ఆదివారం ఆయన అస్వస్థతకు గురవడంతో హుటాహుటిన ముంబయిలోని ఏహెచ్ఐ (ఏషియన్‌ హార్ట్‌ ఇన్‌స్టిట్యూట్‌)కు తరలించినట్లు ఆయన సన్నిహితులు వెల్లడించారు.

అక్కడి వైద్యులు పరీక్షలు నిర్వహించి గుండెకు శస్త్రచికిత్స చేయాలని సూచించారు. ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన ప్రముఖ వైద్యుడు రమాకాంత పాండా సోమవారం ఆయనకు శస్త్రచికిత్స నిర్వహించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో కోలుకుంటున్నారు. బ్రహ్మానందం ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉంది. ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు సోషల్ మీడియా ద్వారా కామెంట్లు పెడుతున్నారు.

ఈ మధ్యకాలంలో బ్రహ్మానందం తక్కువ సినిమాల్లో నటిస్తున్నారు. ‘ది గ్రేట్‌ ఇండియన్‌ లాఫ్టర్‌ ఛాలెంజ్‌’ అనే తెలుగు కార్యక్రమానికి ఆయన న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్నారు.