హిందువుల పవిత్ర గ్రంథం భగవద్గీత దాని సృష్టికర్త శ్రీకృష్ణుడిలా విశ్వరూపం ప్రదర్శించింది. ప్రపంచంలో అతిపెద్ద భగవద్గీత ప్రజల చెంతకు వచ్చింది. ఢిల్లీలోని ఇస్కాన్ ఆలయంలో ప్రధాని నరేంద్ర మోదీ దీన్ని మంగళవారం ఆవిష్కరించారు.
800 కేజీల బరువు ఉన్న ఈ పుస్తకంలో 670 పేజీలు ఉన్నాయి. 2.8 మీటర్ల పొడవు, 2 మీటర్ల వెడల్పు ఉండే ఈ భగవద్గీత ప్రపంచంలోనే అతి పొడవైన ఆధ్యాత్మిక గ్రంథం కూడా అని ఇస్కాన్ నిర్వాహకులు తెలిపారు. దీన్ని ఆవిష్కరించడానికి మోద మెట్రో రైల్లో వచ్చారు. ఇస్కాన్ సంస్థ కృష్ణ తత్వాన్ని ప్రంపంచవ్యాప్తంగా ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే.