హిజ్రాపై ప్రియుడి దాడి
బానోత్ రాధిక అనే హిజ్రాకు, మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం మద్దివంచ గ్రామ శివారు కొత్తతండాకు చెందిన ధరావత్ సురేష్‌తో కొన్నేళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారి మహబూబాబాద్ పట్టణంలోని హనుమంతరావు స్థూపం సమీపంలో అద్దె ఇంట్లో ఏడాది కాలంగా సహజీవనం చేస్తున్నారు. అయితే డబ్బులు కావాలని సురేష్ కొద్ది నెలలుగా రాధికను వేధింపులకు గురిచేస్తున్నాడు. దీంతో ఆమె రూ.లక్ష ఇచ్చింది.
ఆతర్వాత కూడా మరో రూ.లక్ష కావాలని వేధింపులకు గురిచేస్తుండటంతో మళ్లీ రూ.లక్ష ఇచ్చింది. ఆతర్వాత మళ్లీ రూ.3లక్షలు కావాలంటూ వారం రోజులుగా వేధిస్తున్నాడు. డబ్బులు లేవని చెబుతుండటంతో బానోత్ రాధికను దూషిస్తూ చితకబాదుతున్నాడు. సురేష్ తల్లి సాలి కూడా మూడు రోజుల క్రితం వచ్చి డబ్బులు ఇవ్వకపోవడంపై దూషించింది. ఈ క్రమంలో సురేష్ హిజ్రా రాధికను వేధిస్తూనే రాత్రి ఆమె అమ్మమ్మ బానోతు జంకు నోట్లో గుడ్డలు కుక్కి ఓ గదిలో పడేశాడు. తర్వాత హిజ్రా రాధికను కత్తితో గొంతుకోసి చంపేందుకు యత్నించాడు.
దీంతో ఆమె గొంతుపై, కుడి కన్ను భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. ఆమె గట్టిగా కేకలు వేయడంతో పక్కింట్లో నివసిస్తున్న శ్రావణి, భర్త కమల్ రాగా సురేష్ పరారయ్యాడు