హీరోయిన్ సాయిపల్లవి పెళ్లిపై షాకింగ్‌ కామెంట్‌ చేశారు. ఏ హీరోయిన్ అయినా తనకు ఇంకా పెళ్లి వయస్సు రాలేదనీ, కెరీర్ ముఖ్యమని అందుకే పెళ్లి చేసుకోవడం లేదనీ చెబుతుంటారు. కానీ సాయి పల్లవి మాత్రం తాజాగా ఓ ఇంటర్వ్యూలో షాకింగ్ కామెంట్ చేసింది. ‘పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకున్నా. నాకు నా తల్లిదండ్రులతోనే ఉండాలని ఉంది. వారిని జాగ్రత్తగా చూసుకోవాలని ఉంది. పెళ్లి జరిగితే అనుకున్నట్లు వారి బాగోగులు చూసుకోలేను. అందుకే జీవితంలో వివాహం చేసుకోకూడదని నిర్ణయించుకున్నా’ అని అన్నారట. దీంతో ప్రస్తుతం ఈ వార్త కాస్త వెబ్‌సైట్లలో వైరల్‌ అవుతోంది. సాయిపల్లవి ‘ఫిదా’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించారు. అందులో ఆమె హావభావాలు, డ్యాన్స్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.